శనివారం చీపురుపల్లి పట్టణంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ 33వ జన్మదిన వేడుకలు వివిధ సేవా కార్యక్రమాలతో, పార్టీ నాయకుల సాన్నిహిత్యంలో ఘనంగా నిర్వహించారు.
ముందుగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గరివిడిలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) కుమార్తె, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డా. బొత్స అనూష ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
తరువాత విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి కమిటీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) కార్యాలయంలో, అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేకులను కట్ చేశారు.
ఆపై బాపూజీ వృద్దాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు.
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు:
చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు
ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం
జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు
చీపురుపల్లి పట్టణ పార్టీ నాయకులు ఇప్పిలి గోవిందరావు,
మంగళగిరి సుధారాణి, శ్రీనివాసరావు, ఇప్పిలి తిరుమల, కోసిరెడ్డి రమణ
చీపురుపల్లి పంచాయతీ కార్యవర్గ సభ్యులు, ఎంపీటీసీలు
యువసేన సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు
పెదబాబు కార్యాలయ సిబ్బంది
కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా జరిగింది.


