అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి)
సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (121*) విరాట్ కోహ్లీ (74*) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ ఇప్పటి వరకు 33 సెంచరీలు నమోదు చేయగా.. ఆస్ట్రేలియాపై ఇది ఆరోది.


