చిల్డ్రన్స్ డే సందర్భంగా ఉర్దూ పాఠశాలలో స్వీట్స్ పంపిణీ చేసిన కొప్పల శంకరయ్య
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు పట్టణంలోని ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఉర్దూ పాఠశాల నందు వైసిపి సీనియర్ నాయకులు కొప్పల శంకరయ్య ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని స్వీట్స్ పంపిణీ చేశారు .ఈ సందర్భంగా కొప్పల శంకరయ్య చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ నెహ్రూ అడుగుజాడల్లో యువత, చిన్నారులు నడవాలని దేశ భవిష్యత్తు కోసం పెద్దలు చూపిన అడుగుజాడలను ఎంచుకోవాలని చిన్నారులకు పిలుపునిచ్చారు అనంతరం పాఠశాలలో ఉన్న అందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మందల పవన్ సాయి, చెన్నంశెట్టి పురుషోత్తం, కొర్లకుంట శంకర తదితరులు పాల్గొన్నారు.


