-ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో సైకిల్ కి జై అంటున్న చియ్యవరం గ్రామానికి చెందిన 60 కుటుంబాలు
-ముక్కా రూపానంద రెడ్డి నాయకత్వంలో టీడీపీ బలోపేతం – చియ్యవరం గ్రామం నుండి 60 కుటుంబాల చేరిక
-ముక్కా రూపానంద రెడ్డి గారి పై నమ్మకంతో టీడీపీలోకి అడుగుపెట్టిన చియ్యవరం గ్రామానికి చెందిన 60 కుటుంబాలు
-40 సంవత్సరాల తర్వాత తొలిసారి ముక్కా రూపానంద రెడ్డి గారి సారథ్యంలో టీడీపీ పార్టీ జెండా చియ్యవరం గ్రామ ప్రజలు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 14(పున్నమి ప్రతినిధి)
రైల్వే కోడూరు మండలంలోని చియ్యవరం గ్రామానికి చెందిన సుమారు 60 కుటుంబాలు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీలోకి చేరారు.అభివృద్ధి పథంలో కొడురును నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంపైన నమ్మకం, రూపానంద రెడ్డి గారి కృషిపైన విశ్వాసంతో ఈ కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరగా, రూపానంద రెడ్డి గారు వారిని సాదరంగా ఆహ్వానించారు.గత 20 సంవత్సరాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలో కనిపించని అభివృద్ధిని కేవలం ఒకటిన్నర సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం చేయగలిగిందని, ప్రజల కోసం రూపానంద రెడ్డి గారు చూపుతున్న తపన, పట్టుదల వల్లే ఈ మార్పు సాధ్యమైందని గ్రామస్థులు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ లోకి చేరిన వారిలో ప్రధానంగా నలసిద్దు నరేష్ రెడ్డి, నలసిద్దు రవీంద్రా రెడ్డి, నలసిద్దు నరసింహా రెడ్డి, నలసిద్దు జగదీశ్వర్ రెడ్డి, నలసిద్దు హరినాథ్ రెడ్డి, నలసిద్దు రజినీకాంత్ రెడ్డి, మద్దిన చంద్రనాయుడు, మద్దిన రామచంద్ర నాయుడు ,మద్దిన మల్లీ నాయుడు ,మద్దిన సుబ్బరామనాయుడు, బుద్ది లక్ష్మీకర్ రెడ్డి, నూక జగన్మోహన్ రెడ్డి, ,మామిళ్ళ కృష్ణా రెడ్డి, వేమన జ్యోతి, జలకం ఆంజనేయులు, జలకం సిద్ధమ్మ, కలగంట్లు లక్ష్మమ్మ, నగిరిపాటి చిరంజీవమ్మ, నగిరిపాటి సిద్దు, ఈగ ఈశ్వరయ్య, ఈగ రత్నమ్మ, నగిరిపాటి ఈశ్వరమ్మ, కాందా రవణమ్మ, పాశాల వేడుకొండల, పాగాల కల్పన, కొండా శేఖర్, కాందా వెంకటరమణ, మల్లు శివ, మల్లు శృతి, మల్లు రవి, నగరపాటి మాధవి, నగరపాటి వెంకటేష్, నగరపాటి జాస్మిన్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.


