Friday, 6 February 2026
  • Home  
  • చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్
- విశాఖపట్నం

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్ *విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నగరంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన 8 వ జోన్ పెందుర్తి రాజచెరువు అంగనవాడి కేంద్రం, పాత పెందుర్తి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో డిసెంబర్ 21 పోలియో ఆదివారం సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలని, పోలియో ఆదివారం సందర్భంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలియో రహితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు పోలియో చుక్కలు వేసేందుకు వీలుకాని చిన్నారులకు డిసెంబర్ 22, 23 వ తేదీల్లో ఏ.ఎన్.ఎంలు ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అలాగే పోలియో చుక్కలు వేయించుకునేందుకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయతగా పలకరించి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని మేయర్ తెలిపారు. నేడు నగరంలో ప్రతి అంగన్వాడి కేంద్రం వద్ద పాఠశాలల్లో, బస్టాండ్లో , రైల్వే స్టేషన్, రైతు బజార్లు లో పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్లు రాజేంద్రప్రసాద్, పీలా జితేంద్ర, డాక్టర్లు, శానిటరీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్

*విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి*
పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నగరంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఆదివారం ఆయన 8 వ జోన్ పెందుర్తి రాజచెరువు అంగనవాడి కేంద్రం, పాత పెందుర్తి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో డిసెంబర్ 21 పోలియో ఆదివారం సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలని, పోలియో ఆదివారం సందర్భంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలియో రహితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు పోలియో చుక్కలు వేసేందుకు వీలుకాని చిన్నారులకు డిసెంబర్ 22, 23 వ తేదీల్లో ఏ.ఎన్.ఎంలు ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అలాగే పోలియో చుక్కలు వేయించుకునేందుకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయతగా పలకరించి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని మేయర్ తెలిపారు. నేడు నగరంలో ప్రతి అంగన్వాడి కేంద్రం వద్ద పాఠశాలల్లో, బస్టాండ్లో , రైల్వే స్టేషన్, రైతు బజార్లు లో పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు .

ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్లు రాజేంద్రప్రసాద్, పీలా జితేంద్ర, డాక్టర్లు, శానిటరీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.