గన్నవరం నియోజకవర్గ ప్రతినిధి ప్రతినిధి
గన్నవరం ఎమ్మెల్యే చొరవ: కూచిపూడి, భరతనాట్యం చేయాలన్నబొమ్మినేని లిఖితకల నెరవేరేనని తెలియజేశారు.
గన్నవరం: కళలకు, సంస్కృతికి పెద్దపీట వేస్తోన్న నూతన కూటమి ప్రభుత్వంలో ఒక చిన్నారి కోరిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన చిన్నారి నికిత, ముఖ్యమంత్రి (సీఎం) నారా చంద్రబాబు నాయుడు వద్ద, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద, మంత్రి నారా లోకేష్ వద్ద తాను నేర్చుకున్న కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన అందించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంది.
ఈ చిన్నారి తన కోరికను విన్నవించుకుంటూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ఆ చిన్నారి కోరికను నెరవేరుస్తానని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
“నిజంగా బొమ్మినేని లిఖిత చాలా మంచి కళాకారిణి. ఇంత చిన్న వయసులో కూచిపూడి, భరతనాట్యం నేర్చుకోవడమే కాకుండా, రాష్ట్ర పెద్దల ముందు ప్రదర్శించాలనే ఆమె ఆశను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సీఎం తాత (చంద్రబాబు నాయుడు) ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం, లోకేష్ మామ అభినందనలు నికితకు దక్కేలా చూస్తాను. ఈ చిన్నారి కళాకారిణి కలను త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి అపాయింట్‌మెంట్ తీసుకుంటాము” అని ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు.
త్వరలోనే ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది అని తెలియజేశారు.

చిన్నారి నర్తన కోరిక: సీఎం, పవన్‌ల వద్ద ప్రదర్శనకు యార్లగడ్డ హామీ*
గన్నవరం నియోజకవర్గ ప్రతినిధి ప్రతినిధి గన్నవరం ఎమ్మెల్యే చొరవ: కూచిపూడి, భరతనాట్యం చేయాలన్నబొమ్మినేని లిఖితకల నెరవేరేనని తెలియజేశారు. గన్నవరం: కళలకు, సంస్కృతికి పెద్దపీట వేస్తోన్న నూతన కూటమి ప్రభుత్వంలో ఒక చిన్నారి కోరిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన చిన్నారి నికిత, ముఖ్యమంత్రి (సీఎం) నారా చంద్రబాబు నాయుడు వద్ద, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద, మంత్రి నారా లోకేష్ వద్ద తాను నేర్చుకున్న కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన అందించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంది. ఈ చిన్నారి తన కోరికను విన్నవించుకుంటూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ఆ చిన్నారి కోరికను నెరవేరుస్తానని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. “నిజంగా బొమ్మినేని లిఖిత చాలా మంచి కళాకారిణి. ఇంత చిన్న వయసులో కూచిపూడి, భరతనాట్యం నేర్చుకోవడమే కాకుండా, రాష్ట్ర పెద్దల ముందు ప్రదర్శించాలనే ఆమె ఆశను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సీఎం తాత (చంద్రబాబు నాయుడు) ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం, లోకేష్ మామ అభినందనలు నికితకు దక్కేలా చూస్తాను. ఈ చిన్నారి కళాకారిణి కలను త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి అపాయింట్‌మెంట్ తీసుకుంటాము” అని ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. త్వరలోనే ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది అని తెలియజేశారు.

