అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా చిత్తలూరు ఎస్సీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గృహ సందర్శనలు,పుట్టినప్పటి నుండి మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న ఇళ్ళను సందర్శించి తల్లులందరికీ మరియు పిల్లలకు ఇచ్చే ఆహారము మరియు వారు వారి వయసుకు తగినంత ఎత్తు బరువు పెరిగేలా చూడాలని తల్లులందరికీ తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబంలో పురుషులు భాగస్వామ్యం ఉండాలని, గర్భవతులు, బాలింతలు మరియు చిన్నపిల్లలు తీసుకునే ఆహారం విషయంలో కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు కూడా అవగాహన కలిగి ఉండి వారి పట్ల శ్రద్ధ వహించి తగిన పోషకాహారం వారికి అందేలా చూసుకొని తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా తగిన చర్య తీసుకోవాలని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమమునందు సూపర్వైజరు పద్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


