-వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు తక్షణ ఆదేశాలు – రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా, రాజంపేట సబ్‌కలెక్టర్ హెచ్.ఎస్. భావన గురువారం చిట్వేల్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా, చిట్వేల్ – రాపూరు – నెల్లూరు రోడ్డు ఆర్ అండ్ బి మార్గంలో అనంపల్లి చెక్‌పోస్ట్ వద్ద నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న సమస్యలను ఆమె పరిశీలించారు.
-అధికారులతో సమీక్ష
రహదారిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని సబ్‌కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె సంబంధిత శాఖాధికారులతో తక్షణ సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో రోడ్డు మీదుగా నీటి ప్రవాహాన్ని అడ్డుకునే అంశాలను గుర్తించి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారిని త్వరగా పునరుద్ధరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నిఖిల్ కుమార్, చిట్వేల్ ఏఎస్‌ఐ వెంగయ్య, ఆర్ అండ్ బి అసిస్టెంట్ ఇంజనీర్ నరేంద్ర, అలాగే గ్రామ రెవెన్యూ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.


