చిట్వేల్ మండలం మాజీ ఎంపీపీ, టిడిపి సీనియర్ నాయకులు, ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన కందుల గుండయ్య నాయుడు మంగళవారం నాడు తన స్వగ్రామమైన కె.కందులవారిపల్లిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో చిట్వేల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రజల నేతగా గుర్తింపు:-
గుండయ్య నాయుడు ప్రజలకు అండగా నిలిచే నాయకుడిగా చిట్వేల్ పరిసర ప్రాంతాల్లో విశేష గుర్తింపు పొందారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి, విద్య, రోడ్లు – వసతుల విస్తరణ వంటి కీలక పనుల్లో ఆయన చేసిన సేవలు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచాయి. ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన నిస్వార్థ సేవా నేతగా పలువురు ఆయన సేవలను స్మరించుకున్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు:
గుండయ్య నాయుడు అంత్యదేహాన్ని చివరిసారి చూడటానికి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆయన స్వగ్రామానికి తరలివచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీ, మాజీ ఎంపీపీలు, మండల నాయకులు, పాఠశాల అధ్యాపకులు, గ్రామ పెద్దలు ఆయనకు నివాళులు అర్పించారు.
అంత్యక్రియలు:-
గుండయ్య నాయుడు మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సమాజ ప్రముఖులు గాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆయన అంత్యక్రియలు బుధవారం ఉదయం10 గంటలకు గ్రామ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.


