Wednesday, 25 March 2026
  • Home  
  • చిట్వేల్ మండలంలో రైతులకు నానో, జీవన ఎరువులపై అవగాహన
- అన్నమయ్య

చిట్వేల్ మండలంలో రైతులకు నానో, జీవన ఎరువులపై అవగాహన

చిట్వేలి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చిట్వేలి సోమవారం మండలంలోని తిమ్మాయగారిపల్లి, సి.కందులవారిపల్లి గ్రామాల్లో రైతులకు నానో ఎరువులు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయంలో PDMS కిట్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి.సుధాకర్ మాట్లాడుతూ, నానో యూరియా, నానో డీఎపి వినియోగం ద్వారా ఎరువుల వృధా తగ్గించడంతో పాటు పంటలకు అవసరమైన మోతాదులోనే పోషకాలు అందుతాయని, పర్యావరణాన్ని కాపాడుతూ అధిక దిగుబడి సాధ్యమవుతుందని వివరించారు.రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులైన రైజోబియం, అజాల్లా, అజోస్పిరిల్లుమ్ వినియోగం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో PDMS కిట్స్, ఘన జీవామృతం, బీజామృతం వాడకం రైతులకు మేలు చేస్తుందని వివరించారు.చిట్వేల్ తహసీల్దార్ శ్రీమతి స్పందన మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదని, ఎవరైనా ఎంఆర్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిట్వేలి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

చిట్వేలి సోమవారం మండలంలోని తిమ్మాయగారిపల్లి, సి.కందులవారిపల్లి గ్రామాల్లో రైతులకు నానో ఎరువులు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయంలో PDMS కిట్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి.సుధాకర్ మాట్లాడుతూ, నానో యూరియా, నానో డీఎపి వినియోగం ద్వారా ఎరువుల వృధా తగ్గించడంతో పాటు పంటలకు అవసరమైన మోతాదులోనే పోషకాలు అందుతాయని, పర్యావరణాన్ని కాపాడుతూ అధిక దిగుబడి సాధ్యమవుతుందని వివరించారు.రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులైన రైజోబియం, అజాల్లా, అజోస్పిరిల్లుమ్ వినియోగం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో PDMS కిట్స్, ఘన జీవామృతం, బీజామృతం వాడకం రైతులకు మేలు చేస్తుందని వివరించారు.చిట్వేల్ తహసీల్దార్ శ్రీమతి స్పందన మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదని, ఎవరైనా ఎంఆర్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.