చిట్వేల్ జూలై 20 (పున్నమి ప్రతినిధి )
*చిట్వేలి కోడూరు రహదారికి మోక్షమెప్పుడు..*
– ప్రమాద భరితంగా చిట్వేలి కోడూరు రహదారి
– రోడ్డు సరిలేక దెబ్బతింటున్న వాహనాలు.
– వాహనాల్లో ప్రయాణించే ప్రయాణీకులను ఆసుపత్రి పాలు చేస్తున్న రహదారి.
చిట్వేలి నుండి కొడూరుకు వెళ్లాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు వర్షాకాలం మొదలు కావడంతో బొప్పాయి కోతలు మొదలయ్యాయి. మామిడి తదితర వాణిజ్య రవాణాకు చాలా కష్టతరంగా మారింది. అనారోగ్య రీత్యా ఈ మార్గం గుండా తిరుపతి పట్టణానికి వైద్య సేవల నిమిత్తం వెళ్లాలంటే అస్తవ్యస్తంగా ఉన్న రహదారి ప్రయాణం క్షతగాత్రులకు, అనారోగ్య పీడితుల మరింత ప్రమాద భరితంగా మారింది ఈ రహదారి. ప్రభుత్వ అధికారులు, నాయకులు దృష్టి సారించి త్వరితగతిన రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేసి సమస్యకు పరిష్కారం చూపుతారని మండల ప్రజలు కోరుతున్నారు.