Sunday, 7 December 2025
  • Home  
  • చిట్వేల్‌లో 09 ఎస్జీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
- అన్నమయ్య

చిట్వేల్‌లో 09 ఎస్జీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

-ఒప్పంద ప్రాతిపదికన అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకం – రేపు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేయాలి: ఎంఈఓ ఖాజా మొహిద్దీన్ చిట్వేల్, డిసెంబర్ 3: పున్నమి ప్రతినిధి చిట్వేల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 09 స్కూల్ అసిస్టెంట్ (ఎస్జీటీ) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యా శాఖాధికారి (ఎంఈఓ) ఖాజా మొహిద్దీన్ తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధుల నుండి ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయనున్నారు. -పోస్టుల వివరాలు, వేతనం ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు పది వేల రూపాయలు (రూ. 10,000/-) గౌరవ వేతనంగా చెల్లించబడుతుంది. మండలంలో ఖాళీగా ఉన్న 09 ఎస్జీటీ పోస్టులు ఉన్న పాఠశాలల వివరాలు కింద ఇవ్వబడ్డాయి: పాఠశాల పేరు పాఠశాల రకం పోస్టుల సంఖ్య ఎంపీపీఎస్ మాలే మార్పురం ప్రాథమిక 1 ఎంపీపీఎస్ చెన్నమ రాజు పోడు ప్రాథమిక 1 జడ్పీపీహెచ్ఎస్ కె. కందులవారిపల్లి ఉన్నత 1 ఎంపీపీఎస్ గట్టుమీద పల్లి ప్రాథమిక 1 ఎంపీపీఎస్ చెర్లో పల్లి ప్రాథమిక 1 జడ్పీహెచ్ఎస్ వెంకటరాజు పల్లి ఉన్నత 1 ఎంపీపీఎస్ తుమ్మకొండ అగ్రహారం ప్రాథమిక 1 ఎంపీపీఎస్ సీఎం రాచ పల్లి ప్రాథమిక 1 జడ్పీహెచ్ఎస్ నాగవరం ఉన్నత 1 మొత్తం 09 -దరఖాస్తు విధానం ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం, అందుకు అవసరమైన అర్హత గల సర్టిఫికెట్లను జతపరిచి రేపు (డిసెంబర్ 4, గురువారం)సాయంత్రం 05:00 గంటలలోపుచిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో అందజేయాలని ఎంఈఓ ఖాజా మొహిద్దీన్ గారు కోరారు.

-ఒప్పంద ప్రాతిపదికన అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకం – రేపు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేయాలి: ఎంఈఓ ఖాజా మొహిద్దీన్

చిట్వేల్, డిసెంబర్ 3: పున్నమి ప్రతినిధి

చిట్వేల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 09 స్కూల్ అసిస్టెంట్ (ఎస్జీటీ) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యా శాఖాధికారి (ఎంఈఓ) ఖాజా మొహిద్దీన్ తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధుల నుండి ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయనున్నారు.

-పోస్టుల వివరాలు, వేతనం

ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు పది వేల రూపాయలు (రూ. 10,000/-) గౌరవ వేతనంగా చెల్లించబడుతుంది.
మండలంలో ఖాళీగా ఉన్న 09 ఎస్జీటీ పోస్టులు ఉన్న పాఠశాలల వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
పాఠశాల పేరు పాఠశాల రకం పోస్టుల సంఖ్య
ఎంపీపీఎస్ మాలే మార్పురం ప్రాథమిక 1
ఎంపీపీఎస్ చెన్నమ రాజు పోడు ప్రాథమిక 1
జడ్పీపీహెచ్ఎస్ కె. కందులవారిపల్లి ఉన్నత 1
ఎంపీపీఎస్ గట్టుమీద పల్లి ప్రాథమిక 1
ఎంపీపీఎస్ చెర్లో పల్లి ప్రాథమిక 1
జడ్పీహెచ్ఎస్ వెంకటరాజు పల్లి ఉన్నత 1
ఎంపీపీఎస్ తుమ్మకొండ అగ్రహారం ప్రాథమిక 1
ఎంపీపీఎస్ సీఎం రాచ పల్లి ప్రాథమిక 1
జడ్పీహెచ్ఎస్ నాగవరం ఉన్నత 1
మొత్తం 09

-దరఖాస్తు విధానం

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం, అందుకు అవసరమైన అర్హత గల సర్టిఫికెట్లను జతపరిచి రేపు (డిసెంబర్ 4, గురువారం)సాయంత్రం 05:00 గంటలలోపుచిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో అందజేయాలని ఎంఈఓ ఖాజా మొహిద్దీన్ గారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.