Thursday, 5 March 2026
  • Home  
  • చిట్వేల్‌లో ‘ఈ-బైక్స్’ విప్లవం.. షోరూమ్‌ను ప్రారంభించిన రూపానంద రెడ్డి!
- అన్నమయ్య

చిట్వేల్‌లో ‘ఈ-బైక్స్’ విప్లవం.. షోరూమ్‌ను ప్రారంభించిన రూపానంద రెడ్డి!

పర్యావరణ హితమైన రవాణా దిశగా చిట్వేల్ పట్టణం మరో అడుగు ముందుకు వేసింది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సద్గురు ఎంటర్ప్రైజెస్, ఎకో మోటివ్ మోటార్స్ ఈ-బైక్స్ గ్రాండ్ షోరూమ్‌ను రైల్వే కోడూరు నియోజకవర్గ చిట్వేల్ లో టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి,గురువారం ఘనంగా ప్రారంభించారు. నిర్వాహకులు గోపిదేశి ప్రసాద్, భాను ప్రకాష్, పిడుగు ప్రసాద్‌ల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కలిసి ముక్కా రూపానంద రెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో ప్రదర్శించిన వివిధ రకాల ఎలక్ట్రిక్ బైకులను వారు పరిశీలించి, వాటి పనితీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో, కాలుష్యం లేకుండా ప్రయాణించే వీలుండటాన్ని వారు అభినందించారు. ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. “పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎకో మోటివ్ మోటార్స్ వంటి సంస్థలు స్థానికంగా అందుబాటులోకి రావడం వల్ల యువతకు ఉపాధితో పాటు, ప్రజలకు ఆధునిక సాంకేతికత అందుతుంది” అని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న స్థానిక యువతను ఆయన ప్రోత్సహించారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎన్డీయే కూటమికి చెందిన కీలక నాయకులు, పట్టణ ప్రముఖులు, స్థానిక వ్యాపారవేత్తలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిట్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ షోరూమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

పర్యావరణ హితమైన రవాణా దిశగా చిట్వేల్ పట్టణం మరో అడుగు ముందుకు వేసింది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సద్గురు ఎంటర్ప్రైజెస్, ఎకో మోటివ్ మోటార్స్ ఈ-బైక్స్ గ్రాండ్ షోరూమ్‌ను రైల్వే కోడూరు నియోజకవర్గ చిట్వేల్ లో టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి,గురువారం ఘనంగా ప్రారంభించారు. నిర్వాహకులు గోపిదేశి ప్రసాద్, భాను ప్రకాష్, పిడుగు ప్రసాద్‌ల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కలిసి ముక్కా రూపానంద రెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో ప్రదర్శించిన వివిధ రకాల ఎలక్ట్రిక్ బైకులను వారు పరిశీలించి, వాటి పనితీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో, కాలుష్యం లేకుండా ప్రయాణించే వీలుండటాన్ని వారు అభినందించారు.
ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. “పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎకో మోటివ్ మోటార్స్ వంటి సంస్థలు స్థానికంగా అందుబాటులోకి రావడం వల్ల యువతకు ఉపాధితో పాటు, ప్రజలకు ఆధునిక సాంకేతికత అందుతుంది” అని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న స్థానిక యువతను ఆయన ప్రోత్సహించారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎన్డీయే కూటమికి చెందిన కీలక నాయకులు, పట్టణ ప్రముఖులు, స్థానిక వ్యాపారవేత్తలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిట్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ షోరూమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.