కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చిట్వేల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించే కళాజాత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సోదరులు, క్రాస్ రోడ్స్ పొదుపు గ్రూపులు, మహిళా సంఘాల సభ్యులకు ఎస్‌ఎస్‌జి రుణాలు, ప్రధానమంత్రి భీమా పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. ప్రధానంగా సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాల లాభాలు, సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను కళాకారులు మాటలు, పాటలు, మ్యాజిక్ షో ద్వారా ఆకట్టుకునేలా వివరించారు. ప్రతి ఒక్కరూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో తప్పనిసరిగా ఖాతా కలిగి ఉండాలని, అలాగే 15 సంవత్సరాల లోపు చిన్నారులకు కేవలం రూ.100తో ఖాతా ప్రారంభించే సదుపాయం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సూపర్వైజర్ విష్ణు సార్, కృష్ణారెడ్డి సార్, కళాజాత బృంద సభ్యులు విజయ్, చిరంజీవి, అరవిందులు పాల్గొనగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

చిట్వేల్‌లో ఆర్థిక అక్షరాస్యతపై కళాజాత కార్యక్రమం