Thursday, 26 March 2026
  • Home  
  • చిట్వేలు మండలంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణ
- అన్నమయ్య

చిట్వేలు మండలంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణ

చిట్వేలు మండలంలో ఉపాధి హామీ పథకం 20వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు (26-03-2026) మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజావేదిక నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డ్వామా పీడీ వెంకట రత్నం ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. సోషల్ ఆడిట్ బృందం మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో చేపట్టిన పనుల వివరాలను సభలో చదివి వినిపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి శ్రామికులకు వేతనాల రూపంలో రూ. 7,46,98,580 ఖర్చు చేయగా, సామాగ్రి ఖర్చులుగా రూ. 34,54,563 వినియోగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 81,794 మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించగా, రూ. 2,60,000 విలువ గల పనులపై విచారణకు ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబుడ్స్‌పర్సన్ శ్రీరాములు, ఏపిడీ ప్రతాప్, ఎస్‌ఆర్‌పీ సూర్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏపీఓ నాగరాజు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ మరియు ఉపాధి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

చిట్వేలు మండలంలో ఉపాధి హామీ పథకం 20వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు (26-03-2026) మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజావేదిక నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డ్వామా పీడీ వెంకట రత్నం ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు.
సోషల్ ఆడిట్ బృందం మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో చేపట్టిన పనుల వివరాలను సభలో చదివి వినిపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి శ్రామికులకు వేతనాల రూపంలో రూ. 7,46,98,580 ఖర్చు చేయగా, సామాగ్రి ఖర్చులుగా రూ. 34,54,563 వినియోగించినట్లు వెల్లడించారు.
ఈ తనిఖీల్లో భాగంగా రూ. 81,794 మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించగా, రూ. 2,60,000 విలువ గల పనులపై విచారణకు ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబుడ్స్‌పర్సన్ శ్రీరాములు, ఏపిడీ ప్రతాప్, ఎస్‌ఆర్‌పీ సూర్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏపీఓ నాగరాజు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ మరియు ఉపాధి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.