చిట్వేలిఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చిట్వేలి మండలంలోని మెయిన్ రోడ్ స్టేట్
బ్యాంక్ వద్ద వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా క్రేజీ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు ఈసారి మరింత వైభవంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణలతో ప్రజలందరిని ఆకట్టుకున్నాయి.
ఉదయం అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ గారి నేతృత్వంలో వినాయకుని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ ధాత బద్రి చంద్ర గారు పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీర్వచనం అందించారు. స్థానిక మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పూజను విజయవంతం చేశారు.
వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే గణేష్ హోటల్ వారు అన్నప్రసాద వితరణ చేపట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది. భక్తులు, గ్రామస్తులు, యాత్రికులు అందరూ ఇందులో పాల్గొని వినాయకుని కృప పొందుతున్నారు.ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా పాల్గొని ఉత్సవ వాతావరణాన్ని మరింత చక్కబెట్టుతున్నారు. ఈ కార్యక్రమాలు చిట్వేలి ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ, సమాజంలో ఐకమత్యం పెంచుతున్నాయి.ఈ వేడుకలను విజయవంతం చేసిన ముఖ్య నిర్వాహకులు చౌడవరం నరసింహ రెడ్డి (బాబు అన్న), చౌడవరం మహేశ్వర్ రెడ్డి, పగడాల గణేష్ కుమార్, కరణం వెంకటసుబ్బయ్య, రామి రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, పగడాల భరత్ కుమార్ మరియు క్రేజీ యూత్ సభ్యులు. వీరి కృషితో వినాయక చవితి ఉత్సవాలు చిట్వేలిలో అంగరంగ వైభవంగా జరిగాయి.భక్తి, ఉత్సాహం, సాంస్కృతిక వైవిధ్యం కలగలిసి చిట్వేలి వినాయక చవితి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.


