
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గుండివిల్లిపేట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న కరవంజ గ్రామానికి చెందిన చింతు వాసుదేవరావు గారు 2025 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందుతున్నారు.ఈ సత్కార కార్యక్రమం రేపు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా జరగనుంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వాసుదేవరావు గారిని సన్మానించనున్నారు.విద్యా రంగంలో విశేష కృషి, విద్యార్థులలో పఠన పట్ల ఆసక్తి పెంపొందించడం, సృజనాత్మకతను వెలికితీయడం, ఆధునిక బోధనా విధానాలను అమలు చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ వాసుదేవరావు గారు ప్రత్యేక కృషి చేశారు.ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ – “విద్యార్థుల విజయం నా విజయమని ఎల్లప్పుడూ నమ్ముతాను. ఈ అవార్డు నా కృషికి మాత్రమే కాకుండా, మా పాఠశాలకు, నరసన్నపేట మండలానికి వచ్చిన గౌరవం” అని అన్నారు.గ్రామ ప్రజలు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆయనను అభినందిస్తూ, విద్యా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

