Story highlights
- చెన్నరావుపేట :(పున్నమి తెలుగు దినపత్రిక ) దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆ మహా నేతకు ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్..నేడు నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ కార్యాలయం వద్ద నెహ్రు…
- ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ సృజనాత్మకత నూతన ఆలోచనలు దాగి ఉంటాయని నెహ్రూ గారు విశ్వసించేవారని గుర్తుచేశారు బాలల హక్కులను పరిరక్షిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ భయంలేని బాల్యాన్ని అందించి వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాలని అన్నారు, విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే నెహ్రూ గారి ఆశయాలకు…
- ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు భూక్య గోపాల్ నాయక్ మొగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీపీ కేతిడి వీరా రెడ్డి జిల్లా కార్యదర్శి కంది క్రిష్ణ చైతన్య రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ సర్పంచ్ దార రంజిత్ బాలు నాయక్ ఉప సర్పంచుల ఫోరం…
చెన్నరావుపేట :(పున్నమి తెలుగు దినపత్రిక )
దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆ మహా నేతకు ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్..నేడు నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ కార్యాలయం వద్ద నెహ్రు జయంతి వేడుకలకు హాజరై చాచా నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్ మాట్లాడుతూ విద్య, విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి చాచా నెహ్రూ గారు వేసిన పునాదులు భారత ప్రగతికి బాటలు వేశాయని అన్నారు.నెహ్రూ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమానత్వం లౌకికవాదం ప్రజాస్వామ్య స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని కోరారు. ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ సృజనాత్మకత నూతన ఆలోచనలు దాగి ఉంటాయని నెహ్రూ గారు విశ్వసించేవారని గుర్తుచేశారు బాలల హక్కులను పరిరక్షిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ భయంలేని బాల్యాన్ని అందించి వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాలని అన్నారు, విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే నెహ్రూ గారి ఆశయాలకు నిజమైన నివాళి అని వారు పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు భూక్య గోపాల్ నాయక్ మొగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీపీ కేతిడి వీరా రెడ్డి జిల్లా కార్యదర్శి కంది క్రిష్ణ చైతన్య రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ సర్పంచ్ దార రంజిత్ బాలు నాయక్ ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ ఎస్సి సెల్ జిల్లా వైస్ చైర్మన్ మాదారపు చరణ్ సొసైటీ డైరెక్టర్లు తిరుపతి రెడ్డి నర్సింహా రావులు నాయకులు చిట్టె లింగయ్య వెంకటేశ్వర్లు లక్క రాజు భద్రయ్య రమేష్ రాజు శివ తదితరులు పాల్గొన్నారు
News Sources
- PraveenPress release