Story highlights
- చెన్నరావుపేట : ( పున్నమి తెలుగు దినపత్రిక) స్థానిక అమీనాబాద్ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్‌లో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) పురస్కరించుకుని శనివారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం పాఠశాల ప్రిన్సిపాల్…
- అనంతరం ప్రిన్సిపాల్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
- విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక రంగాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మరియు 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులుగా బాధ్యతలు నిర్వర్తించి ఆకట్టుకున్నారు జిల్లా…
చెన్నరావుపేట : ( పున్నమి తెలుగు దినపత్రిక)
స్థానిక అమీనాబాద్ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్‌లో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) పురస్కరించుకుని శనివారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చిట్టా జ్యోతి గారు మరియు ఉపాధ్యాయ బృందం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక రంగాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు ఈ వేడుకల్లో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మరియు 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులుగా బాధ్యతలు నిర్వర్తించి ఆకట్టుకున్నారు జిల్లా విద్యాధికారి (DEO): మెండే వినయ్ (ఎంపీసీ ద్వితీయ సంవత్సరం) మండల విద్యాధికారి (MEO): మన్నం స్రవంతి (ఎంపీసీ ద్వితీయ సంవత్సరం) ప్రిన్సిపాల్: మేడిద మేఘన (10వ తరగతి – ఆర్యభట్ట) వైస్ ప్రిన్సిపాల్: అరిగే బ్యూలా (10వ తరగతి – ఆర్యభట్ట) వీరి ఆధ్వర్యంలో ఉదయం పూట తరగతుల నిర్వహణ, పర్యవేక్షణ ఎంతో క్రమశిక్షణతో సాగాయి. అనంతరం మధ్యాహ్నం విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News Sources
- PraveenPress release