Wednesday, 11 February 2026
  • Home  
  • చల్లమల్ల కృష్ణారెడ్డి బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడా ?
- యాదాద్రి భువనగిరి

చల్లమల్ల కృష్ణారెడ్డి బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడా ?

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 20 : అల్లందేవిచెరువు గ్రామంలో, అధికార పార్టీ కాకుండా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిపించడంలో, చల్లమల్ల క్రిష్ణరెడ్డి హస్తం ఉందా? అవును ఉంది అనే ఆరోపణ వినిపిస్తున్నాయి. రేపే ఎన్నికలు అనే రోజు వరకు ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో తిరిగిన కొంతమంది రెడ్డి నాయకులు ఎన్నికల రోజు కనపడకుండా ఉండటం పలు విమర్శలకు తావిస్తుంది. అదే రోజు చల్లమల్ల కృష్ణారెడ్డి బిజెపి నాయకులతో కలిసి శాలువాతో సత్కారం చేయించుకోవడం వారితో కలిసి ఉన్న ఫోటో పై పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. చలమల్ల తీరుపై కాంగ్రెస్ నాయకులు పలు ఆరోపణలు చేస్తున్నారు .బీజేపీ పార్టీ సర్పంచ్ గెలిచిన చోట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల క్రిష్ణరెడ్డి సన్మానం చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ? బీజేపీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి కి ఏం సంబంధం ఏమిటని ప్రశ్నార్థకంగా మిగిలింది. చల్లమల్ల బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి నాయకులతో కలిసి ఉండటం నిజమే అయి ఉండవచ్చునని, గెలిచిన బీజేపీ పార్టీ సర్పంచ్ ర్యాలీలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి శాలువాతో సత్కారం చేయించుకోవడంపై రెడ్డి రాజకీయం నడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నాగవారిగూడెం , గొల్లగూడెం గ్రామాలకు చలమల్ల సరైన సహకారం అందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మల్లారెడ్డిగూడెం లో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సొంతం గ్రామం లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోవడం స్వతంత్ర అభ్యర్థి గెలిపించడంలో చలమల్ల పాత్ర ఉందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. నారాయణపురం మండలంలో ఒక వర్గం ఏర్పాటు చేసుకొని, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు తన వర్గం కాకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఏ అభ్యర్థి నైనా ఓడించడానికి సాయ శక్తులు ప్రయత్నం చేయడం జరిగిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అల్లందేవిచెరువు,లింగ వారి గూడెం, మల్లారెడ్డిగూడెం, చిమిర్యాల, మహమ్మదాబాద్ , కంకణాలగూడెం, ఇలా చెప్పుకుంటూ వెళితే సుమారు 10 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలువనీయకుండా చేసినటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటది అనేది వేచి ఉండాలని అంటున్నారు. వివిధ రాజకీయ నాయకులు. సొంత పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఓడించడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 20 : అల్లందేవిచెరువు గ్రామంలో, అధికార పార్టీ కాకుండా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిపించడంలో, చల్లమల్ల క్రిష్ణరెడ్డి హస్తం ఉందా? అవును ఉంది అనే ఆరోపణ వినిపిస్తున్నాయి. రేపే ఎన్నికలు అనే రోజు వరకు ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో తిరిగిన కొంతమంది రెడ్డి నాయకులు ఎన్నికల రోజు కనపడకుండా ఉండటం పలు విమర్శలకు తావిస్తుంది. అదే రోజు చల్లమల్ల కృష్ణారెడ్డి బిజెపి నాయకులతో కలిసి శాలువాతో సత్కారం చేయించుకోవడం వారితో కలిసి ఉన్న ఫోటో పై పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. చలమల్ల తీరుపై కాంగ్రెస్ నాయకులు పలు ఆరోపణలు చేస్తున్నారు .బీజేపీ పార్టీ సర్పంచ్ గెలిచిన చోట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల క్రిష్ణరెడ్డి సన్మానం చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ? బీజేపీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి కి ఏం సంబంధం ఏమిటని ప్రశ్నార్థకంగా మిగిలింది. చల్లమల్ల బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి నాయకులతో కలిసి ఉండటం నిజమే అయి ఉండవచ్చునని, గెలిచిన బీజేపీ పార్టీ సర్పంచ్ ర్యాలీలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి శాలువాతో సత్కారం చేయించుకోవడంపై రెడ్డి రాజకీయం నడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నాగవారిగూడెం , గొల్లగూడెం గ్రామాలకు చలమల్ల సరైన సహకారం అందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా మల్లారెడ్డిగూడెం లో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సొంతం గ్రామం లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోవడం స్వతంత్ర అభ్యర్థి గెలిపించడంలో చలమల్ల పాత్ర ఉందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.
నారాయణపురం మండలంలో ఒక వర్గం ఏర్పాటు చేసుకొని, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలు తన వర్గం కాకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఏ అభ్యర్థి నైనా ఓడించడానికి సాయ శక్తులు ప్రయత్నం చేయడం జరిగిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అల్లందేవిచెరువు,లింగ వారి గూడెం, మల్లారెడ్డిగూడెం, చిమిర్యాల, మహమ్మదాబాద్ , కంకణాలగూడెం, ఇలా చెప్పుకుంటూ వెళితే సుమారు 10 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలువనీయకుండా చేసినటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటది అనేది వేచి ఉండాలని అంటున్నారు. వివిధ రాజకీయ నాయకులు. సొంత పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఓడించడానికి ముఖ్య పాత్ర వహిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.