చంద్రబాబు పాచిక పారేనా ?
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కాషాయంవైపు చూస్తున్నారా ? మోడీతో చెలిమి చేసేందుకు సిద్ధమవుతున్నారా ? అందుకే ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తున్నారా ? పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీపై ఒంటి కాలుపై లేచిన చంద్రబాబు ఇప్పుడు నెమ్మదించారు. అధికారంలో లేరు. ఘోరంగా పరాజయం పాలయ్యారు. దీనికి తోడు ఉన్న కొద్దిమంది నాయకులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి స్కెచ్ తో ముందుకెళ్తే బలపడవచ్చనే దానిపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. 151 సీట్ల మెజార్టీతో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జగన్ జెట్ స్పీడుతో ముందుకెళుతున్నారు. అభివృద్ది సంక్షేమ పధకాలు అమలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై కౌంటర్ లు కూడా వేయలేని స్థితికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్ ఆరు నెలల పాలన అనంతరం విమర్శలుగానీ, ఆరోపణలుగానీ చేస్తామన్న చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3నెలలకే విమర్శలు మొదలుపెట్టారు. అయినా అధికారపార్టీని ధీటుగా ఎదుర్కోలేక పోతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్కువగా గెలవడం.. గెలిచినవారు కూడా పక్కచూపులు చూస్తుండడం, ఇతర పార్టీలకు జంప్ చేయడంతో చంద్రబాబు మరింత కుంగిపోతున్నారు. ఇక టీడీపీ నేతలపై కేసులు నమోదు కావడం, అరెస్టులు జరగడంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు. ఒకవైపు పార్టీ ఏమైపోతుంది అన్న టెన్షన్ వుంటే మరోవైపు ఏడాది కాలంలోనే టీడీపీ బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం చేసే పనిలో సీఎం జగన్ పడడంతో ఎన్నడూ చూడని రాజకీయ విచిత్రాలను చంద్రబాబు తొలిసారి చవిచూస్తున్నారు. ఇంకోవైపు కరోనా ప్రబలిపోతుండడంతో గతంలోలాగా జనంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టాలంటే తన ఒక్కడితో సాధ్యమయ్యే పనికాదన్న విషయాన్ని గ్రహించారు. ఈ తరుణంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు తనకు మోడీతో వ్యక్తిగత విబేధాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేశానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైసీపీపై విమర్శలు గుప్పిస్తూనే బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి అన్యాయం చేస్తుందోంటూ బీజేపీ ప్రభుత్వంపైన ఆరోపణలు చేసిన చంద్రబాబు, అంతటితో ఆగకుండా ఏకంగా మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని మోడీతో దోస్తీకి సై అంటూ సంకేతాలిస్తున్నారు. అయినా అటువైపు నుంచి సమాధానం రావడం లేదు సరికదా బాబుని కన్నెత్తైనా చూడడం లేదు. దీంతో చంద్రబాబు ప్రయత్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, కామినేని శ్రీనివాసరావు వంటి నేతలు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారే. అయితే వీరి ద్వారా రాయబారం నడుపుతారా ? అలా అనుకున్నా చంద్రబాబు గురించి నేరుగా మోడీతో మాట్లాడేందుకు సాహసిస్తారా ? అనేది ప్రశ్నార్ధకం. ఎన్నికల ముందు మోడీతో సున్నం పెట్టుకున్న చంద్రబాబుకు, ఇప్పుడు ఆయనను ఎలా ప్రసన్నం చేసుకోవాలో మాత్రం బోధపడడం లేదు. ఇక ఎప్పటినుంచో ఏపీలో ఒంటరిగా ఎదగాలని బీజేపీ కలలు కంటూ వస్తోంది. ఇప్పుడు టీడీపీ హవా తగ్గడం, మరో బలమైన పార్టీ లేకపోవడంతో తనదైన శైలిలో పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీతో బీజేపీ చెలిమి చేసే అవకాశముందా ? అసలు అంత అవసరం వుందా ? అందులోనూ ఎన్నికల ప్రచార సమయంలో మోడీని దూషించిన చంద్రబాబుతో దోస్తీ చేసేందుకు ముందుకొస్తుందా ? అన్నది అనుమానమే. అయినా చంద్రబాబు ప్రస్తుతం అవేవీ పట్టించుకోవడం లేదు. బీజేపీతో సఖ్యతతో ఉంటే భవిష్యత్తులోనైనా సత్ఫలితాలిస్తాయనే భావనలో ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలన్నా, జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలన్నా కమలంతో జట్టు కట్టక తప్పదని తెలుసుకున్న చంద్రబాబు అదే ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం ఇటీవలికాలంలో ప్రధానిపై ప్రశంసలు కురిపించడమే. అయితే మోడీ ఏమీ చంద్రబాబుకి చుట్టం కాదు, ఏది చెప్పినా వినేయడానికి, నమ్మేయడానికి. రాజకీయాలలో ద్వంద్వ వైఖరితో చక్రం తిప్పడంలో, ఎప్పటికప్పుడు నాలుక మడత వేయడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు… మోడీ ముందు వేస్తున్న స్నేహ పాచిక పారేనా ? అది జరిగే పనేనా ?
చంద్రబాబు పాచిక పారేనా ? టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కాషాయంవైపు చూస్తున్నారా ? మోడీతో చెలిమి చేసేందుకు సిద్ధమవుతున్నారా ? అందుకే ప్రధానిపై ప్రశంసలు కురిపిస్తున్నారా ? పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీపై ఒంటి కాలుపై లేచిన చంద్రబాబు ఇప్పుడు నెమ్మదించారు. అధికారంలో లేరు. ఘోరంగా పరాజయం పాలయ్యారు. దీనికి తోడు ఉన్న కొద్దిమంది నాయకులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి స్కెచ్ తో ముందుకెళ్తే బలపడవచ్చనే దానిపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. 151 సీట్ల మెజార్టీతో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జగన్ జెట్ స్పీడుతో ముందుకెళుతున్నారు. అభివృద్ది సంక్షేమ పధకాలు అమలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై కౌంటర్ లు కూడా వేయలేని స్థితికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్ ఆరు నెలల పాలన అనంతరం విమర్శలుగానీ, ఆరోపణలుగానీ చేస్తామన్న చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3నెలలకే విమర్శలు మొదలుపెట్టారు. అయినా అధికారపార్టీని ధీటుగా ఎదుర్కోలేక పోతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్కువగా గెలవడం.. గెలిచినవారు కూడా పక్కచూపులు చూస్తుండడం, ఇతర పార్టీలకు జంప్ చేయడంతో చంద్రబాబు మరింత కుంగిపోతున్నారు. ఇక టీడీపీ నేతలపై కేసులు నమోదు కావడం, అరెస్టులు జరగడంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు. ఒకవైపు పార్టీ ఏమైపోతుంది అన్న టెన్షన్ వుంటే మరోవైపు ఏడాది కాలంలోనే టీడీపీ బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం చేసే పనిలో సీఎం జగన్ పడడంతో ఎన్నడూ చూడని రాజకీయ విచిత్రాలను చంద్రబాబు తొలిసారి చవిచూస్తున్నారు. ఇంకోవైపు కరోనా ప్రబలిపోతుండడంతో గతంలోలాగా జనంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టాలంటే తన ఒక్కడితో సాధ్యమయ్యే పనికాదన్న విషయాన్ని గ్రహించారు. ఈ తరుణంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు తనకు మోడీతో వ్యక్తిగత విబేధాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేశానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైసీపీపై విమర్శలు గుప్పిస్తూనే బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి అన్యాయం చేస్తుందోంటూ బీజేపీ ప్రభుత్వంపైన ఆరోపణలు చేసిన చంద్రబాబు, అంతటితో ఆగకుండా ఏకంగా మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని మోడీతో దోస్తీకి సై అంటూ సంకేతాలిస్తున్నారు. అయినా అటువైపు నుంచి సమాధానం రావడం లేదు సరికదా బాబుని కన్నెత్తైనా చూడడం లేదు. దీంతో చంద్రబాబు ప్రయత్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, కామినేని శ్రీనివాసరావు వంటి నేతలు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారే. అయితే వీరి ద్వారా రాయబారం నడుపుతారా ? అలా అనుకున్నా చంద్రబాబు గురించి నేరుగా మోడీతో మాట్లాడేందుకు సాహసిస్తారా ? అనేది ప్రశ్నార్ధకం. ఎన్నికల ముందు మోడీతో సున్నం పెట్టుకున్న చంద్రబాబుకు, ఇప్పుడు ఆయనను ఎలా ప్రసన్నం చేసుకోవాలో మాత్రం బోధపడడం లేదు. ఇక ఎప్పటినుంచో ఏపీలో ఒంటరిగా ఎదగాలని బీజేపీ కలలు కంటూ వస్తోంది. ఇప్పుడు టీడీపీ హవా తగ్గడం, మరో బలమైన పార్టీ లేకపోవడంతో తనదైన శైలిలో పావులు కదుపుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీతో బీజేపీ చెలిమి చేసే అవకాశముందా ? అసలు అంత అవసరం వుందా ? అందులోనూ ఎన్నికల ప్రచార సమయంలో మోడీని దూషించిన చంద్రబాబుతో దోస్తీ చేసేందుకు ముందుకొస్తుందా ? అన్నది అనుమానమే. అయినా చంద్రబాబు ప్రస్తుతం అవేవీ పట్టించుకోవడం లేదు. బీజేపీతో సఖ్యతతో ఉంటే భవిష్యత్తులోనైనా సత్ఫలితాలిస్తాయనే భావనలో ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలన్నా, జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలన్నా కమలంతో జట్టు కట్టక తప్పదని తెలుసుకున్న చంద్రబాబు అదే ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం ఇటీవలికాలంలో ప్రధానిపై ప్రశంసలు కురిపించడమే. అయితే మోడీ ఏమీ చంద్రబాబుకి చుట్టం కాదు, ఏది చెప్పినా వినేయడానికి, నమ్మేయడానికి. రాజకీయాలలో ద్వంద్వ వైఖరితో చక్రం తిప్పడంలో, ఎప్పటికప్పుడు నాలుక మడత వేయడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు… మోడీ ముందు వేస్తున్న స్నేహ పాచిక పారేనా ? అది జరిగే పనేనా ?

