*అమరావతి* అక్టోబర్ పున్నమి ప్రతినిధి:
సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు
సీఎంతో భేటీకి హాజరైన ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగ సంఘం సహా ఉపాధ్యాయ సంఘాల నేతలు
భేటీకి హాజరైన మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు
*మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ*
గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నాం
గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టడం చారిత్రాత్మక ఘట్టం
రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరికీ ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నాం
ఆప్కాస్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు.
ఆర్ధిక అంశాలపై ఎలాంటి దాపరికం లేదు. ఎవరినీ కించపరిచే పరిస్థితి లేదు.
ఉద్యోగులతో కలిసే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లగలం
రూ.51,452 కోట్లను ఎస్టాబ్లిష్ మెంట్ కోసమే వ్యయం చేస్తున్నాం. అంటే 91శాతం ఖర్చు ఎస్టాబ్లిష్‌మెంట్ కోసమే వ్యయం చేస్తున్నాం
పొరుగు రాష్ట్రాలన్నీ గత ఐదేళ్లలో జాగ్రత్తపడ్డాయి.
తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 39 శాతానికి ఈ వ్యయాన్ని తగ్గించుకున్నాయి
గత ఐదేళ్లలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్లే ఇబ్బందులు పడే పరిస్థితి.
భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అనుత్పాదక వ్యయం కోసం ఖర్చు చేశారు.

