రాజమండ్రి, సెప్టెంబర్ 11:
సెప్టెంబర్ 21 నుండి 25 వరకు పంజాబ్ రాజధాని చండీగర్ లో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలు సందర్భంగా 21 న జరిగే ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ లో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుండి రెండు బస్సుల్లో జట్ల లేబర్ యూనియన్ కార్మికులు గురువారం తెల్లవారుజామున చండీగర్ కు బయలుదేరారు అ బస్ లను సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మధు, జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో ఈనెల అనగా సెప్టెంబర్ 21 తేదీన జరగనున్నందున ఛలో చండీగఢ్ పిలుపుమేరకు సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేసేందుకు తూర్పుగోదావరి జట్ల లేబర్ యూనియన్ సభ్యులు సుమారు 100 మంది మొదటిరోజు ప్రదర్శన లో పాల్గొనేందుకు రెండు బస్ లలో బయలుదేరి వెళ్లారని అన్నారు జట్ల సంఘ నిధులు పెద్ద ఎత్తున వెచ్చించి , పార్టీ శత వసంతాల వేడుకల తరుణంలో జరుగుతున్న జాతీయ మహాసభల సందర్భంగా జరుగు మొదటి రోజు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్తున్నామని అన్నారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నుండి దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని వామపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఈ మహాసభలు దోహదపడతాయని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి
పి లావణ్య, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, జట్ల సంఘం అధికార బడి సభ్యులు నల్ల రామారావు, పి దేముడు బాబు, కళ్ల అప్పలనాయుడు, వెంకటరావు బాలకృష్ణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు.

చండీగర్ జాతీయ మహాసభలకు రాజమండ్రి కార్మికులు
రాజమండ్రి, సెప్టెంబర్ 11: సెప్టెంబర్ 21 నుండి 25 వరకు పంజాబ్ రాజధాని చండీగర్ లో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలు సందర్భంగా 21 న జరిగే ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ లో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుండి రెండు బస్సుల్లో జట్ల లేబర్ యూనియన్ కార్మికులు గురువారం తెల్లవారుజామున చండీగర్ కు బయలుదేరారు అ బస్ లను సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధు, జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో ఈనెల అనగా సెప్టెంబర్ 21 తేదీన జరగనున్నందున ఛలో చండీగఢ్ పిలుపుమేరకు సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేసేందుకు తూర్పుగోదావరి జట్ల లేబర్ యూనియన్ సభ్యులు సుమారు 100 మంది మొదటిరోజు ప్రదర్శన లో పాల్గొనేందుకు రెండు బస్ లలో బయలుదేరి వెళ్లారని అన్నారు జట్ల సంఘ నిధులు పెద్ద ఎత్తున వెచ్చించి , పార్టీ శత వసంతాల వేడుకల తరుణంలో జరుగుతున్న జాతీయ మహాసభల సందర్భంగా జరుగు మొదటి రోజు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్తున్నామని అన్నారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నుండి దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని వామపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఈ మహాసభలు దోహదపడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, సీపీఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, జట్ల సంఘం అధికార బడి సభ్యులు నల్ల రామారావు, పి దేముడు బాబు, కళ్ల అప్పలనాయుడు, వెంకటరావు బాలకృష్ణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు.

