ఖమ్మం
ఉల్లాసంగా ఉత్సాహంగా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల వన సమారాధన
ఖమ్మం నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులు శనివారం ఉత్సాహభరితంగా వన సమారాధన కార్యక్రమం ని స్థానిక చెరుకూరి గార్డెన్ని లో ర్వహించారు. కార్తీక మాస శుభవేళలో పాఠశాల నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.
చిన్నారుల నృత్యాలతో వన ప్రాంగణం హోరెత్తగా, మ్యాజిక్ షో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఉరకలేసే ఉత్సాహంతో పాల్గొన్న చిన్నారులు వాతావరణాన్ని మరింత సంతోషభరితంగా మార్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య తో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు.


