గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం దేశంలోని సుమారు 500 సంస్థానాల విలీనంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 52 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. యువత వీరి త్యాగాలు, సేవలను ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, గుర్రం నూకరాజు, స్వర్ణపుడి రాంబాయి, తమిరె శివప్రసాదరావు, డివి సత్యరావు తదితర టిడిపి, కూటమి నాయకులు పాల్గొన్నారు.


