నిర్మల్ జిల్లా: నిర్మల్ లో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కమిటీ డైరెక్టర్ మరియు మాజీ న్యాయమూర్తి యం.ఏ. సలీం గారు ముఖ్య అతిథిగా హాజరై, ఆర్టీఐ ఆక్టివిస్టులకు, మరియు మిగితా సభ్యులకు ఆర్టీఐ చట్టం పైన పూర్తి అవగాహన కల్గి ఉండాలని, కొత్త చట్టాల గురించి తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం 05 అక్టోబర్ నుండి 12 అక్టోబర్ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స.హా. చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ హైదర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స.హా. చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత జవాబుదారితనం స.హ. చట్టం ఉద్దేశమన్నారు. సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగ బద్దమైన హక్కు అని తెలిపారు. స.హా. చట్టం సెక్షన్లు, దరఖాస్తు విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలొ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. వినోద్, జహీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాధిక్, హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాస్, సాయి,మిగితా సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా సమాచార హక్కు చట్టం వారోత్సవాలు