కామారెడ్డి,30 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి :
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహిం చినట్లు సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలోని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలతో బతుక మ్మలను పేర్చి, సాంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ,నృత్యాలు చేస్తూ ఉత్సవాలను నిర్వహించారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొ ని, పండుగ శోభను పెంచారు. సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి గారు పండుగ ప్రాముఖ్యత గురించి మాట్లాడి, అందరికీ బతుకమ్మ శుభాకాం క్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంకరి రాజ లింగం, ఆకుల సిద్దిరాములు, ఆకుల శివదినం, పయ్యావు ల గంగాధర్, సంకరి నారాయణ, దయాకర్, కొండ ల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


