*ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు…*
పొదలకూరు పట్టణం బస్ స్టాండ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్దంతి సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గేట్ సెంటర్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పెషేంట్లకు బ్రేడ్లు, పండ్లు, పంపిణి చేశారు. జోహార్ వైఎస్సార్ అంటూ మహా నేత మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రమణా రెడ్డి, వైయస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య మాట్లాడుతూ మరణం లేని వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. అదేవిధంగా దేశానికి స్వతంత్రం వచ్చాక విద్య ,వైద్యం, సేద్యం తదితర రంగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో పరిపాలించిన మొట్టమొదటి యోధుడిని వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో చుశామన్నారు..నేడు ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ భూమి, ఆకాశం ఉన్నంత వరకు ఈ భగీరధుని రూపం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబెర్ షేక్. అంజాద్, గంగవరపు. వేణు గోపాల్ రెడ్డి, దాదిబత్తిన. భాస్కర్ రెడ్డి, అకులూరు. హేమంత్ కుమార్, పముజుల. శంకర్, మందారపు. జనార్దన్, షేక్. ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.


