ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
మండలంలోని పలు గ్రామాల్లో వినాయకుని నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. వడ్లమానులో విఘ్నేశ్వరుడికు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో 2వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనం చేశారు. ఆగిరిపల్లి, నూగుండపల్లి లో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వడ్లమాను ఎంపీటీసీ సభ్యులు రాణి మేకల సత్యనారాయణ, వైయస్సార్ సిపి నాయకులు కుప్పాల నాగరాజు, సర్పంచ్ జలసూత్రం వంశీ కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం
ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలోని పలు గ్రామాల్లో వినాయకుని నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. వడ్లమానులో విఘ్నేశ్వరుడికు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో 2వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనం చేశారు. ఆగిరిపల్లి, నూగుండపల్లి లో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో వడ్లమాను ఎంపీటీసీ సభ్యులు రాణి మేకల సత్యనారాయణ, వైయస్సార్ సిపి నాయకులు కుప్పాల నాగరాజు, సర్పంచ్ జలసూత్రం వంశీ కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

