– ఓం ఓం భైరవ బంకల భైరవ మార్మోగిన నినాదాలు
కామారెడ్డి,10 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇస్సనపల్లి శ్రీ కాలభైరవస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో ప్రాముఖ్యంగా శుక్రవారం సాయంత్రం లక్షదీపార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేద పండితుల మంత్రోచ్చారణలతో దీపార్చన మొదల య్యి, కుటుంబాలు, పెద్దలు, యూత్ సభ్యులు కలిసి వివిధ ఆకృతులు సృష్టించి దీపాలను వెలిగించటం దైవభక్తిని ప్రదర్శించారు.ఉత్సవాలు కార్తీక పౌర్ణమి తరువాత ఐదు రోజులపాటు జరుగుతుండటంతో, వీటిలో డోలారోహణం, భజనలు, రథోత్సవం, అగ్ని గుండాల వంటి ప్రధాన కార్యక్రమాలు జరుగుతా యని ఆలయ ఈవో ప్రభుస్వామి తెలిపారు. అలాగే, భక్తుల వసతుల కు ప్రత్యేకంగా వసతి గదులు, స్నాన సౌకర్యాలు, నిత్య అన్నదానం అందుబాటు లో ఉన్నాయని తెలిపారు. కార్తీకమాసం దేవతలైన శివ, విష్ణు పూజ లకు మరింత పావిత్రత కలిగిన మాసం. ఈ కాలం లో శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన పూజలు, 108 పాదయాత్రలు, నందాదీపా లు, ఆకాశదీపాల వంటి ప్రకాశోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. భక్తు లు ఈ పూజల ద్వారా శ్రేయస్సును పొందు తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఉత్సవాల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, మహిళలు, యువతులు భక్తులతో కలిసి పాల్గొన్నారు.


