మన ఊరు మన జెండా రెపరెపలాడిన కాషాయ జెండా
పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జనార్ధన్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి ఘనంగా చేశారు. ఇదే సందర్భంగా మన ఊరు మన జెండా ను ఆవిష్కరించి కాషాయ జెండాను ఎగురవేశారు. అలాగే కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తరువాతనే భారత దేశంలో హిందుత్వానికి రక్షణ కలిగిందని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అంథోదయ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యంగా సేవయే పరమావధిగా, అంటూ దేశమే ప్రథమంగా అంటూ జన సంఘ కాలం నుండి నేటి వరకు పార్టీ జెండాను మోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి, ప్రభాకర్ నాయుడు, మునయ్య, గోపినాదరెడ్డి, రాజీవ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




