వనపర్తి జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు డి. చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని పూలతో బతుకమ్మను అందంగా అలంకరించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం స్థానిక సల్కలాపూర్ చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చెన్నప్ప మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఇలాంటి పండుగలు విద్యార్థులకు సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తాయని తెలిపారు.


