*డాక్టర్ యశస్వీ రమణకు సత్కారం*
*విజయవాడ : మల్లె తీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కలిమి శ్రీ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏడాది కాలం పదవీ బాధ్యతలను పూర్తి చేసుకున్న రచయితడాక్టర్ రమణ యశస్విని ముఖ్య అతిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గోళ్ళ నారాయణ రావు, శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ , కలెక్టర్ లక్ష్మి షా , నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ, డాక్టర్ ఇండ్ల రామ ,సుబ్బా రెడ్డి, ఆకాశవాణి డైరెక్టర్ కృష్ణ కుమారి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర్ రెడ్డి, ఏపీ సృజనాత్మక సీఈఓ ఆర్. మల్లికార్జున రావు, చిన్ని నారాయణ రావు, రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీ.వీ పూర్ణచంద్, సీనియర్ జర్నలిస్టులు నిమ్మరాజు చలపతి రావు, యేమినేని వెంకట రమణ, ఘంటా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.*


