రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,అక్టోబర్23,(పున్నమి ప్రతినిధి):
చౌటుప్పల్ ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు ఏడవ తరగతి 2001 – 2007 సంవత్సర విద్యార్థులు.ఈ నేపథ్యంలో విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించుకున్నారు.వారు చదువుకున్న నాటి జ్ఞాపకాలను,ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క విద్యా బోధనలను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ రెడ్డి,మురళీధర్ రావు,సత్తయ్య,సత్యవతి, సరళ,మాట్లాడుతూ తమను పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పిలిచి సత్కరించినందుకు,అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దీవించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు మల్లికార్జున్,ఖాసిం,శ్రావణ్,సికిందర్,నవీన్,జగదీష్,ప్రవీణ్,అబ్బాస్,జావిద్,ఇమ్రాన్,శ్రీను,సాయిరాం, సమీన,చందన,ఊర్మిళ,శ్రావణి,తదితరులు,పాల్గొన్నారు.


