రిపోర్టర్ సింగం కృష్ణ, భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్, అక్టోబర్ 23,(పున్నమి ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పత్రిక విలేఖరి దోర్నాల గజేందర్ నేత జన్మదిన వేడుకలను ఆయన మిత్రబృందం వారి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్,యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు విడం సాయి కిషోర్ నేత,పత్రికా విలేకరులు సింగం కృష్ణ,చెరుకు రమేష్ గౌడ్,బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుసరి వెంకటేష్ గౌడ్,మిత్రులు తదితరులు పాల్గొన్నారు.


