రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి) డిసెంబర్ 09:
రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైల సాంబశివరావు జన్మదిన వేడుకలను కార్యకర్తల సమక్షంలో జరుపుకున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్లో అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పైల సాంబశివరావు మాట్లాడుతూ నాపై మీరు చూపిస్తున్న అభిమానానికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

