తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి కుమార్తె కుమారి గెహిని రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో అత్యంత వైభవంగా, సేవా దృక్పథంతో నిర్వహించబడ్డాయి.
* గెహిని రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద స్థానిక ప్రజలకు మరియు నిరుపేదలకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
* ఆడంబరాలకు పోకుండా, సమాజ సేవలో భాగంగా తన కుమార్తె పుట్టినరోజును జరుపుకోవడం అభినందనీయమని స్థానికులు ఆశీర్వదించారు.
* ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2000 మందికి పైగా భక్తులు, స్థానికులు మరియు పేద ప్రజలు పాల్గొని భోజనం చేశారు.
* వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వయంగా డాలర్స్ దివాకర్ రెడ్డి ,తన కుటుంబ సభ్యులతో కలిసి వడ్డించారు.
* ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తన కుమార్తె గెహిని రెడ్డి ప్రతి ఏడాది ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆమెపై ఉండాలని కోరారు.
* ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,పలువురు కూటమి నాయకులు,మరియు డాలర్స్ దివాకర్ రెడ్డి అభిమానులు పాల్గొని, గెహిని రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



