*వనపర్తి జిల్లా జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన*
*ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 28 11 2025
2025-2026 వనపర్తి జిల్లా చిట్యాల గురుకుల పాఠశాలలో గౌరవ కలెక్టర్ ఆదర్శ్ సురభి గారి అధ్యక్షతన , గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని సార్ గారి ఆధ్వర్యంలో, డీఎస్ఓ శ్రీనివాసులు సార్ పర్యవేక్షణలో చిట్యాల గురుకుల పాఠశాలలో ఈరోజు జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన నవంబర్ 28, 29, 30 మూడు రోజులు జిల్లా స్థాయిలోన నేడు జరుగుతున్నది,జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారి శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలను చిట్యాల గురుకుల పాఠశాలలోన ప్రదర్శించడం జరుగుతుంది,
ఈ సందర్భంగా వనపర్తి జిల్లా గౌరవ కలెక్టర్ ఆదర్శ్ సురభి
గారు మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలు విద్యార్థులలో
సృజనాత్మకతకు నిదర్శనం అన్నారు, శాస్త్ర విజ్ఞానపు ప్రయోగాలు సత్యం అన్నారు,
ఈ కార్యక్రమంలో సూపర్ విజన్ కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ, స్టేజ్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఫుడ్ కమిటీ, ప్రెస్ కమిటీ చైర్మన్లు గా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులను
నియమించడం జరిగింది, ఈరోజు జిల్లాస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వనపర్తి ఎమ్మార్వో రమేష్ రెడ్డి గారు, జిల్లా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, పత్రికా విలేఖరులు పాల్గొనడం జరిగింది.
ప్రెస్ కమిటీ,ఎం ఎన్ విజయకుమార్, బి.గిరిరాజాచారి.


