దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల నవీన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ యం సర్దార్ నాయక్
జనం న్యూస్ ఆగస్టు 03 ప్రతినిధి దూపం అంజనేయలు: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో బోనాల పండుగ సందర్భంగా ఘనంగా శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ మొదటి వార్షికోత్సవం మరియు బోనాల పండగ మైసమ్మ దేవతల ఆలయాలను దర్శించిన దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల నవీన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ యం సర్దార్ నాయక్, కమిటీ సభ్యులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ దేవుని ఆశీస్సులు, వేద విద్యానగర్ ముంగనూరు తుర్కయంజాల్ మున్సిపాలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని దీవెన వల్ల వర్షాలు బాగా కురిసి పాడిపంటలతో రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపాల్టీ పెద్దలు, ఆలయ కమిటీ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


