నెల్లూరు నగరంలోని శ్రీ ఏనుగు సుందరరామిరెడ్డి కల్యాణ మండపం నందు APGEA ఉద్యోగ సంఘ నాయకులు శ్రీ చొప్పా రవీంద్రబాబు, శ్రీ ఏనుగు రమణారెడ్డి, శ్రీ యడవల్లి మల్లికార్జున, శ్రీ గునుపాటి శ్రీనివాసులు రెడ్డి, శ్రీమతి ఎ. గిరిజ గార్ల ఉద్యోగ విరమణ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కె ఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ నేటి సన్మాన గ్రహీతల ఉద్యోగ సేవలు మరియు APGEA సంఘ నిర్మాణాత్మక సేవలు అత్యంత ప్రశంసనీయం మరియు సూర్తిదాయకమని, వారిని తాను ఎంతో అభిమానిస్తానని అంటూ, యువత ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎమ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ రవీంద్రబాబు, శ్రీ రమణారెడ్డి తదితరులు సంఘానికి ఎంతో మంది యువ నాయకులను అందించారని ప్రశంసించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ జి నాగసాయి మాట్లాడుతూ నేడు సన్మాన గ్రహీతల ఉద్యోగ మరియు సంఘ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. పలువురు వక్తలు సన్మాన గ్రహీతలు చేసిన సేవలను ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన APGEA నాయకులకు ముఖ్య అతిథుల చేతులమీదుగా అత్యంత ఘన సత్కారం జరిగింది. చివరగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, ఇంత మంది ఉద్యోగుల, ఉద్యోగ నాయకుల అభిమానాన్ని చూరగొనడం తన అదృష్టమని, ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగ, సామాజిక సేవలలో భాగస్వామ్యులవుతామని అంటూ, హాజరైన అశేష ఉద్యోగ వాహినికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి శ్రీ కె ఆర్ సూర్యనారాయణ గారి సమక్షంలో ఏనుగు రమణారెడ్డి అధ్యక్షతన, వై మల్లికార్జున కార్యదర్శిగా నెల్లూరు జిల్లా APGEA కు అనుబంధంగా పెన్షనర్ల విభాగం ఏర్పాటైంది. నూతన పెన్షనర్ల సంఘానికి జిల్లా కార్యవర్గం అభినందనలు తెలియజేసింది.
భారీగా ప్రభుత్వ ఉద్యోగులు హాజరయిన ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా APGEA అధ్యక్షులు శ్రీ బి సుధాకర రెడ్డి అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి రాంప్రసాద్ కన్వీనర్ గా జిల్లా కార్యవర్గం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి APGEA ఒంగోలు జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. నెల్లూరు జిల్లాలోని అన్ని తాలూకాల అధ్యక్ష కార్యదర్సులు, ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమమునకు విచ్చేసిన అతిథులకు, జయప్రదం చేసిన APGEA శ్రేణులకు, మీడియా వారికి జిల్లా కార్యదర్శి రాంప్రసాద్ అభినందనలు తెలిపారు.