తిరుపతి, ఏప్రిల్ 2 పున్నమి ప్రతినిధి
మహిళలు నచ్చేలా మెచ్చేలా.. మన్నిక.. నాణ్యత.. సౌలభ్యత చిమ్నే వరల్డ్ ఎ స్మార్ట్ కిచెన్ సొంతమని ఇటువంటి షోరూం తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని పేర్కొన్నారు. గురువారం తిరుపతి ఎంఆర్ పల్లి పోలీస్ సమీపంలో చిమ్నే వరల్డ్ ఎ స్మార్ట్ కిచెన్ షోరూం ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి షోరూమ్ అందుబాటులోకి రావడం తిరుపతి ప్రజలకు గర్వకారణం అన్నారు. ఇంటికి కావాల్సిన కిచెన్ వస్తువులన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటం మహిళలకు ఎంత సౌకర్యంగా ఉంటుందన్నారు. మంచి నాణ్యమైన కిచెన్ సామాగ్రిని సరసమైన ధరలతో ప్రజలకు అందుబాటులోకి రావడం శుభ పరిణామం అన్నారు. రామచంద్ర పురానికి చెందిన హేమంత్, వంశీ లు నూతనంగా ఈ వ్యాపారం లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వారు వ్యాపారం లో దినదినాభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా షోరూం అధినేతలు హేమంత్, వంశీ ఎమ్మెల్యేని ఇతర అతిథులను ఘనంగా సత్కరించారు.

