పున్నమి ప్రతినిధి
అక్టోబర్ 25
ఆంధ్రాయూనివర్సిటీ ఔట్ గేట్ సమీపంలో సందాని ఇస్లామిక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాజరత్ మహబూబ్ సుభాని, గౌస్ పాక్ వారి గ్యార్మీ షరీఫ్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు మధ్యాహ్నం అసర్ నమాజ్ అనంతరం ఖురాన్ ఖాని, సాయంత్రం సమీప పరిసర ప్రాంతాల్లో గౌస్ పాక్ వారి సందల్ సందాని ఇస్లామిక్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది. నరై తక్బీర్ అల్లాహు అక్బర్, గౌస్ క దామాన్ నహి చోడేంగే అంటూ గౌస్ అజం వారిని ప్రశంసిస్తూ వారి భక్తిని చాటుకున్నారు. అనంతరం రాత్రి గౌస్ పాక్ నిషాని వద్ద సలాతు సలాం, ఫాతేహ, సర్కార్ గౌస్ పాక్ వారి జెండా ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎత్తున (తబ్ రుఖ్), ప్రసాద వితరణ, ఆమ్ దావత్ జరిగింది. నగర పరిసర ప్రాంతంల నుండి పెద్ద ఎత్తున ముస్లిం లు పాల్గొన్నారు


