– అన్నారం గ్రామంలో భక్తి మహా పండుగ
కామారెడ్డి, 14డిసెంబర్, (పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం: ప్రత్యేక సంచరణకామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం అన్నారం గ్రామంలో గట్టు మల్లన్న ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల ఉత్సాహం, గ్రామీణ సంస్కృతి మహిమలు కనిపించిన ఈ జాతరలో వేలాది మంది పాల్గొన్నారు.ఉదయం నుంచి భక్తి సంబరాలుప్రధాన అర్చకులు మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మల్లన్న ఉత్సవాలు ఈ ఏటా కూడా అందంగా జరిగాయి” అని పేర్కొన్నా రు. ఉదయం సుప్రభాత సేవలు, అభిషేక పూజల తో ప్రారంభమైన ఉత్సవాలు మల్లన్న కళ్యాణోత్స వం ఘనంగా నిర్వహించారు.భక్తులు వెంట తెచ్చు కున్న మొక్కులను హుండిలో వేసి, మనసులోని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి, దైవదారిశిని పొందారు.ఎడ్లబండ్లు, అన్నదానం.. గ్రామోత్సవ సంబరాలు కుల సంఘా ల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా జరిగింది. దూండగల నృత్యాలు, ఢమ్ ఢమ్ డ్రమ్స్‌తో గ్రామం మొత్తం మైమపడింది. చివరగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఆనందంగా పాల్గొన్నారు.


