ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
ఏఐటియుసి యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరి మురళి.
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31( పున్నమి పున్నమి): రైల్వే కోడూరు నియోజకవర్గ, ఓబులవారిపల్లి మండలం, మంగంపేటలోని ఏపీఎండీసీ అడ్మినిస్ట్రేషన్ ఆవరణలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తుమ్మల కృష్ణ చైతన్య అధ్యక్షతన సలివెందుల మునిశేఖర్ పార్ల రామచంద్రయ్య గారు ఏఐటియుసి జెండాను ఎగరవేయడం జరిగినది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోలమణి, సిపిఐ పార్టీ రైల్వే కోడూరు కార్యదర్శి జ్యోతి చిన్నయ్య,అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ, స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దార్ల రాజశేఖర్, సిపిఐ ఓబులవారిపల్లి మండల కార్యదర్శి నాగమ్మ ఏపీఎండిసి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ మన భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నగరంలో ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో కార్మిక గర్జనల నుండి కార్మికుల అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వ కుట్రల నుండి ఎన్నో వీరోచిత కార్యాచరణ నేపథ్యంలో ఏఐటీయూసీ ఆవిర్భవించింది. ప్రధమ అధ్యక్షులుగా లాలాలజపతిరాయ్ ని, ప్రధాన కార్యదర్శి గా వి.యం. పవార్ ని మహాసభ ఎన్నుకున్నాది. ఆ తరువాత కాలంలో పండిట్ జవర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి.వి.గిరి, సరోజినినాయుడు, సి.ఆర్.దాస్ ఇంకా చాలామంది స్వాతంత్ర్యోద్యమ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఏఐటీయూసీ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. 1921లో ఝారియాలో జరిగిన ఏఐటీయూసీ ద్వితీయ మహాసభల్లో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అందరికన్నా ముందే నినదించి మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. భారతదేశ స్వతంత్ర పోరాట వేదికగా గుర్తింపు పొందిన భారత జాతీయ కాంగ్రెస్ ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని వ్యతిరేకించింది. ఆ తరువాత స్వతంత్ర పోరాటంలో ఏఐటీయూసీ అగ్రభాగాన నిలబడిపోతుందని ఎనిమిదేళ్ళ తరువాత 1929 సంవత్సరంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రజలందరికీ, స్వేచ్చా, సమానత్వంతో పాటు కార్మికవర్గ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా దేశంలో ఎన్నో పోరాటాలు నడిపిన చరిత్ర ఏఐటీయూసీ కి మాత్రమే ఉందని, ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం కార్మికవర్గం పై దాడులు, అర్ధాకలి, అణిచివేత నుండి కార్మిక వర్గాన్ని విముక్తి చేస్తూ మరోవైపు వారిని సంఘటితం చేస్తూ దేశ స్వతంత్ర ఉద్యమంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో వారి తొత్తులైన స్వదేశీ పెట్టుబడిదారులతో కార్మిక హక్కుల కొరకు వారి జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం ఎన్నో అలుపెరగని నిర్విరామ పోరాటాలు చేసి కార్మిక వర్గం నేడు అనుభవిస్తున్న సౌకర్యాలను, అమల్లో ఉన్న చట్టాలను ఎన్నిటినో సాధించిన ఘనత ప్రప్రథమంగా ఏఐటీయూసీ కి దక్కుతుంది
◆ 1923 కార్మిక నష్టపరిహార చట్టం. ◆1926 ఇండియన్ ట్రెడ్ యూనియన్ చట్టం. ◆1936 వేతనాల చెల్లింపు చట్టం. ◆ 1947 పారిశ్రామిక వివాదాల చట్టం. ◆1948 పారిశ్రామిక ఉద్యోగ స్థాయి నియామక చట్టం. ◆1966 షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం. 1920 లో పురుడోసుకున్న నాటి నుంచి భారత కార్మిక వర్గానికి ఒకే ఒక్క కేంద్ర కార్మిక సంఘంగా భాసిల్లి దాదాపు 44 రకాల చట్టాలకు రూపశిల్పిగా నిలిచిన చరిత్ర ఏఐటియుసి కి మాత్రమే ఉంది. ప్రభుత్వరంగ స్థాపన, పరిరక్షణ కొరకు అహర్నిశలు కృషి సల్పిన, సలుపుతున్న జాతీయ అతి పెద్ద కార్మిక సంఘం ఏఐటియుసి అని కొనియాడారు.భారతదేశంలో కార్మిక వర్గం నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలను రూపుమాపి బడా కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికులని కట్టుబానిసలుగా మార్చే దుర్మార్గాలకి పాల్పడుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను పరిరక్షించేందుకు, కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు కార్మికులందరూ ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు అసోసియేషన్ నాయకులు మరియు ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గురసాల దినేష్, బత్తల హరి, వడ్డీ లక్ష్మీనారాయణ, నారదాసు మణికంఠ, పుల్లగంటి బాలు గుంతా భాను ప్రకాష్, కాలవ సుబ్రహ్మణ్యం వడ్డీ విజయ్ కృష్ణ, పోకూరు మనోజ్, కొట్టిడి సాయి, పార్ల కిషోర్, గ్రందే మణికంఠ రసూల్, నరసింహులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జయరాం వెంకటరమణ, తేజ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు శివయ్య నాగేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు.


