ఐ. పోలవరం మండలం ఐ పోలవరం గ్రామంలో
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది.ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులైన ప్రజలకు స్వచ్ఛందంగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా అందించిన సేవలు అమోఘమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన భూపతిరాజు సుభద్ర రాజు (చంటిబాబు) గారు ప్రశంసించారు. మరో ముఖ్య అతిథి సాగిరాజు సూరిబాబు రాజుగారు మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో దేశభక్తి నిర్మాణం చేస్తూ దేశ సేవలో నిమగ్నమైంది అని అన్నారు. 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్, 2025 విజయదశమి కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ముఖ్య వక్త విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత సత్సంగ ప్రముఖ్ శ్రీ రాళ్లపల్లి పాపాయ శర్మ తెలిపారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో గృహ సంపర్కం, హిందూ సమ్మేళనాలు, సద్భావన సమావేశాలు, ప్రతిష్టతవ్యక్తుల సమావేశాలు,శాఖలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం-పాకిస్తాన్, చైనా యుద్ధ సమయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సైనికులకు సహకరించారని, ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని, సమాజంలో అన్ని రకాల బేధ భావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ ,స్వదేశీ జీవనశైలి మరియు పౌరవిధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం మన కర్తవ్యం.ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
భూపతి రాజు చంటిబాబుగారు, సాగిరాజు సూరిబాబు రాజు, సాగిరాజు బాపిరాజు,ముమ్మిడివరం ఖండ సంఘ్ చాలక్ పెన్మెత్స గోపాల కృష్ణంరాజు, ఆర్ఎస్ఎస్ జిల్లా గ్రామీణ వికాస్ సంయోజక్ సలాది శ్రీనివాసరావు,బొంతు కనకారావు, పేరా బత్తుల రామకృష్ణరావు, ఏలూరి రాంబాబు, గొలకోటి వెంకటరెడ్డి గారు,సాన బోయిన రాంబాబు, సఖిరెడ్డి శ్రీనివాస్, మామిడాల వీర వెంకట సత్యనారాయణ
మరియు ఐ పోలవరం ఉప మండలం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ఐ పోలవరం,కేశనకుర్రు,కేశనకుర్రు పాలెం,తిల్లకుప్ప,టి కొత్తపల్లి గ్రామాల ప్రముఖులు, స్థానిక గ్రామ పెద్దలు,రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు…
ఐ. పోలవరం మండలం ఐ పోలవరం గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది.ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులైన ప్రజలకు స్వచ్ఛందంగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా అందించిన సేవలు అమోఘమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన భూపతిరాజు సుభద్ర రాజు (చంటిబాబు) గారు ప్రశంసించారు. మరో ముఖ్య అతిథి సాగిరాజు సూరిబాబు రాజుగారు మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో దేశభక్తి నిర్మాణం చేస్తూ దేశ సేవలో నిమగ్నమైంది అని అన్నారు. 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్, 2025 విజయదశమి కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ముఖ్య వక్త విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత సత్సంగ ప్రముఖ్ శ్రీ రాళ్లపల్లి పాపాయ శర్మ తెలిపారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో గృహ సంపర్కం, హిందూ సమ్మేళనాలు, సద్భావన సమావేశాలు, ప్రతిష్టతవ్యక్తుల సమావేశాలు,శాఖలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం-పాకిస్తాన్, చైనా యుద్ధ సమయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సైనికులకు సహకరించారని, ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని, సమాజంలో అన్ని రకాల బేధ భావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ ,స్వదేశీ జీవనశైలి మరియు పౌరవిధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం మన కర్తవ్యం.ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపతి రాజు చంటిబాబుగారు, సాగిరాజు సూరిబాబు రాజు, సాగిరాజు బాపిరాజు,ముమ్మిడివరం ఖండ సంఘ్ చాలక్ పెన్మెత్స గోపాల కృష్ణంరాజు, ఆర్ఎస్ఎస్ జిల్లా గ్రామీణ వికాస్ సంయోజక్ సలాది శ్రీనివాసరావు,బొంతు కనకారావు, పేరా బత్తుల రామకృష్ణరావు, ఏలూరి రాంబాబు, గొలకోటి వెంకటరెడ్డి గారు,సాన బోయిన రాంబాబు, సఖిరెడ్డి శ్రీనివాస్, మామిడాల వీర వెంకట సత్యనారాయణ మరియు ఐ పోలవరం ఉప మండలం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ఐ పోలవరం,కేశనకుర్రు,కేశనకుర్రు పాలెం,తిల్లకుప్ప,టి కొత్తపల్లి గ్రామాల ప్రముఖులు, స్థానిక గ్రామ పెద్దలు,రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.

