కామారెడ్డి, 06డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి యి గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుక లు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆదర్శ పురు షుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, అర్పించినివాళులు అర్పించారు.స్థానిక నాయకు లు, యువత,రైతులు సహా పాల్గొని, ఆయన సంఘ సంస్కరణలకు ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ,, బాబాసాహెబ్ రాజ్యాంగ రచన, అస్పృశ్యత నిర్మూలన పోరాటాలను గుర్తు చేశారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలు, యువ సంఘాలు, అంబేద్కర్ సిద్ధాంతాలు గ్రామీణ జీవితాల్లో అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల స్పందనకుల్వాయి ప్రజలు ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం వల్ల గ్రామంలో ఐక్యత, సామాజిక న్యాయ భావనలు మరింత పెరిగాయి. డా. అంబేద్కర్ ఆదర్శాలు తెలంగాణ గ్రామాల్లో జీవించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇలాం టి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయని నాయకులు చెప్పారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కొత్తల గంగారం సొసైటీ డైరెక్టర్ నారాయణరెడ్డి రాజకీయ నేతలు, అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


