గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మెషిన్ లు పంపిణీ
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్నేహితులరోజు సందర్బంగా ఉచితంగా టైలరింగ్ శిక్షణ పొందిన వారికి మిత్రుడు సిద్దార్థ జ్ఞాపకర్ధం ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి కుట్టు మెషిన్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోడూరు మెయిన్ బ్రాంచ్ చీఫ్ మనేజర్ సి. రఘునాధ్ కుమార్ మాట్లాడుతూ మిత్రుడు జ్ఞాపకర్ధం 100 కు పైగా బ్యాచులకు టైలరింగ్ శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఆధునిక టైలరింగ్ పద్ధతుల ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారని శిక్షణ పూర్తి చేసుకున్న మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా బ్యాంక్ ద్వారా సహకరిస్తామన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తక్కువ ప్రీమియంతో ఇస్తున్న ప్రమాద భీమా సదుపాయాలు విజపయోగించుకోవలన్నారు. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ డి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, క్రమశిక్షణతో బ్యాంకు లావాదేవీలు నిర్వహించాలన్నారు. వినియోగదారుల అవసరాలు గమనిస్తూ నాణ్యమైన పని చేయడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చునన్నారు. ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారథి మాట్లాడుతూ మిత్రుడు సిద్దార్థ జ్ఞాపకార్థం ఇప్పటివరకు స్వంత నిధులతో 104 బ్యాచుల ద్వారా 3200 మందికి టైలరింగ్ శిక్షణ ఇచ్చామని, సంక్రాంతికి బట్టలు కుట్టే విధంగా శిక్షణ ఇచ్చే విధంగా సంక్రాంతికి వస్తున్నాం అనే నినాదంతో కొత్త బ్యాచ్ ప్రారంభించమన్నారు. బ్యాంక్ చీఫ్ చేతుల మీదుగా మహిళలకు టైలరింగ్ మెటీరియల్ కిట్లు, సబ్సిడీతో కుట్టు మెషిన్లు, శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు, మహిళలకు క్రీడల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ట్రస్ట్ కో ఆర్డినేటర్, మహిళలు పాల్గొన్నారు.


