*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*
గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ
విఎంఆర్డిఎ ద్వారా పర్యాటకానికి పెద్ద పీట వేస్తున్నాం
సందర్శకులను,పర్యాట కుల్ని ఆకర్షించేలా పలు ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నాం
విశాఖ పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నాం
ఇందులో భాగంగానే దేశంలో మొదటిసారిగా కైలాసగిరి పై సాహస క్రీడల్లో భాగంగా సుమారు రూ.7 కోట్ల రూపాయలతో గ్లాస్ బ్రిడ్జి ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం
సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో 40 ఎంఎం మందం గల గాజుతో ఈ వంతెన నిర్మాణం జరిగింది
ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా హూద్ హూద్ వంటి తుఫాన్ సమయాల్లో, గంటకు 250 కి మీ వేగంతో గాలులు వీచిన సరే తట్టు కునేలా ఈ గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేయటం జరిగింది.
ఈ గ్లాస్ బ్రిడ్జి పై సుమారు 100 మంది వరకు ఒకేసారి వెళ్ళవచ్చు కానీ పర్యాటకులు సందర్శకులు భద్రత పరంగా ప్రస్తుతం ఒకేసారి 40 మందికి మాత్రమే అనుమతి ఇవ్వటం జరుగుతోంది.
గ్లాస్ బ్రిడ్జి మొదటి నుంచి చివర వరకు నడవటానికి 5 నుంచి 7 నిమషాలు సమయం పడుతుంది.
అలానే త్వరలో కైలాసగిరి పై త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందు బాటులోకి తీసుకువస్తున్నాం.
సందర్శకులను, పర్యాట కుల్ని ఆకర్షించేలా ఇప్పటికే బీచ్ రోడ్ హేలీ మ్యూజియం అందుబాటులో తీసుకు వచ్చాం మరిన్ని ప్రాజెక్టులు కూడా తీసువస్తాం గ్లాస్ బ్రిడ్జ్ లో పాల్గొన్న ఎంపీ భరత్ మేయర్ పీలాశ్రీనివాస్ ఎమ్మెల్యే వెలగపూడి రామ కృష్ణ బాబు,గ్లాస్ బ్రిడ్జ్ నిర్వాహకులు పాల్గొన్నారు.


