పున్నమి ప్రతి నిధి సెప్టెంబర్
గ్రూప్ 1 నియామకాల విషయం లో హై కోర్టు క్లియరన్స్ ఇవ్వడం తో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 లో విజయం సాధించిన అభ్యర్థులకి 27 వ తేదీ శనివారం నాడు హైదరాబాద్ శిల్పకళ వేదిక లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులకి నియామక పత్రాలు అందజేయనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమం కు అన్ని శాఖ ల మంత్రులు హాజరయ్యేలా చుడాలని ఆదేశించారు.


