విశాఖపట్నం, అక్టోబర్ 2:
స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నంను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీలా శ్రీనివాసరావు సత్కరించారు.
గాంధీ జయంతి వేడుకల అనంతరం జివిఎంసి సుమా సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపిక అందజేశారు.
స్వచ్చతా హి సేవా – 2025లో భాగంగా విద్యా సంస్థల్లో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు, ఇంటి వద్ద కూరగాయలు – పండ్ల సాగు ప్రోత్సాహం, వంటింటి వ్యర్థాల నుంచి ఎరువు తయారీ, కోరమాండల్ ఫర్టిలైజర్స్ అందించిన గుడ్డ సంచుల పంపిణీ, ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ గౌరవం లభించింది.
ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్లు రమణమూర్తి, వర్మ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


